గాలి కాలుష్యంతో ఊపిరి తిత్తులకి చాలా హాని.. వాటిని శుభ్రం చేసుకునే సింపుల్ టిప్

ఇప్పుడు అన్ని రంగాలూ కాలుష్యం అయినట్లే వాతావరణం కూడా తీవ్రమైన కాలుష్యభరితమైంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం వెరసి జీవి మనుగడమే ప్రమాదం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్ లో అమ్మకానికి పెట్టకుండా స్వచ్ఛంగా, ఉచితంగా దొరికే ఏకైక పదార్థం కూడా గాలి ఒక్కటే కనిపిస్తోంది. అయితే ఉచితంగా లభించినా సరే ఈ గాలి ద్వారా కాలుష్య కారకాలు మన శరీరంలోకి ప్రవేశించి శ్వాస సంబంధ సమస్యలు కలిగిస్తున్నాయి. ఊపిరితిత్తులకు విపరీతమైన హాని తలపెడుతున్నాయి. చుట్టా, బీడీ, సిగరెట్ కంటే ఎక్కువ ప్రమాదం కలిగించే గాలి కూడా మనం ఒక్కో సారి పీలుస్తూ ఉంటాం. దీనివల్ల ఒకదానికి ఒక అనారోగ్య సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇంత తెలిసినా ఏ మాత్రం కేర్ తీసుకోరు. అయితే..

గాలి కాలుష్యం కంట్రోల్ చేయడం ఏ ఒక్కరో పూనుకుంటే అయ్యేది కాదు. కొన్ని ఏళ్లపాటు మానవులంతా పర్యావరణ స్పృహతో పనిచేస్తే రిజల్టు ఉండొచ్చు. అప్పటి వరకు మాత్రం మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల అలసట, దగ్గు, క్షయ, లంగ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శారీరక ఆరోగ్యంతో పాటు, గాలి కాలుష్యం వల్ల సైకలాజికల్ గా కూడా సమస్యలు ఎదురవుతాయి. గాలి కాలుష్యం వల్ల వాళ్లకున్న డైలీ యాక్టివిటీస్ ని కూడా మిస్ అవుతూ ఉంటారు.

ఉదాహరణకు రన్నింగ్, ఎక్సర్ సైజ్ వంటి రకరకాల యాక్టివిటీస్ కి దూరంగా ఉండిపోతారు. దీనివల్ల రెస్పిరేటరీ ఫంక్షన్ తగ్గిపోతుంది. గాలి కాలుష్యం వల్ల ప్లాక్, టాక్సిన్స్ రెస్పరేటరీ ట్రాక్స్ ని బ్లాక్ చేస్తాయి. దీనివల్ల లంగ్ క్యాన్సర్, శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లంగ్స్ ని డెటాక్స్ చేయడం చాలా అవసరం. మలినాలను న్యాచురల్ పద్ధతిలో బయటకు పంపవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:-

  • తాజా అల్లం తురుము కొద్దిగా
  • 2 టేబుల్ స్పూన్ల పసుపు
  • కొన్ని వెల్లుల్లి రెబ్బలు
  • 2 టేబుల్ స్పూన్ల పంచదార

తయారు చేసే విధానం :-

కొన్ని నీళ్లు తీసుకుని.. బాగా మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో.. పైన చెప్పిన పదార్థాలన్నీ వేయాలి ఆ నీటిని ఇప్పుడు ఒక గ్లాస్ జార్ లోకి వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ డ్రింక్ ని కనీసం 2 నెలలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అల్లం, వెల్లుల్లి, పసుపు ఊపిరితిత్తుల్లో పేరుకున్న మలినాలను ఎఫెక్టివ్ గా తరిమేయగలవు. అలాగే కొన్ని రోజుల్లోనే… టాక్సిన్స్ ని బయటకు పంపి.. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి.

Comments