Posts

గాలి కాలుష్యంతో ఊపిరి తిత్తులకి చాలా హాని.. వాటిని శుభ్రం చేసుకునే సింపుల్ టిప్

Image
ఇప్పుడు అన్ని రంగాలూ కాలుష్యం అయినట్లే వాతావరణం కూడా తీవ్రమైన కాలుష్యభరితమైంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం వెరసి జీవి మనుగడమే ప్రమాదం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్ లో అమ్మకానికి పెట్టకుండా స్వచ్ఛంగా, ఉచితంగా దొరికే ఏకైక పదార్థం కూడా గాలి ఒక్కటే కనిపిస్తోంది. అయితే ఉచితంగా లభించినా సరే ఈ గాలి ద్వారా కాలుష్య కారకాలు మన శరీరంలోకి ప్రవేశించి శ్వాస సంబంధ సమస్యలు కలిగిస్తున్నాయి. ఊపిరితిత్తులకు విపరీతమైన హాని తలపెడుతున్నాయి. చుట్టా, బీడీ, సిగరెట్ కంటే ఎక్కువ ప్రమాదం కలిగించే గాలి కూడా మనం ఒక్కో సారి పీలుస్తూ ఉంటాం. దీనివల్ల ఒకదానికి ఒక అనారోగ్య సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇంత తెలిసినా ఏ మాత్రం కేర్ తీసుకోరు. అయితే.. గాలి కాలుష్యం కంట్రోల్ చేయడం ఏ ఒక్కరో పూనుకుంటే అయ్యేది కాదు. కొన్ని ఏళ్లపాటు మానవులంతా పర్యావరణ స్పృహతో పనిచేస్తే రిజల్టు ఉండొచ్చు. అప్పటి వరకు మాత్రం మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. గాలి కాలుష్యం వల్ల అలసట, దగ్గు, క్షయ, లంగ్ క్యాన్సర్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. శారీరక ఆరోగ్యంతో పాటు, గాలి కాలుష్యం వల్ల సైకలాజికల్ గా కూడా సమస్యలు ఎదురవుతాయి.